శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.. రేపు స్వచ్చ తిరుమల

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 67,851 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,381 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.19 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలిపారు. రేపు తిరుమల ఘాట్ రోడ్లలో స్వచ్చ తిరుమల కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల ఆలయాల వీధులన్నీ శుద్ధం చేసేందుకు 37 కిలోమీటర్ల మేర స్వచ్చ తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ పాల్గొననున్నారు.

Latest Articles

ఎలాంటి అవాంతరాలు లేకుండా నీట్‌ రీ ఎగ్జామ్‌ను నిర్వహిస్తాం- ధర్మేంద్ర ప్రధాన్‌

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించారు. మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. పరీక్షకు సంబంధించిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్