కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బండి లేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు గడుస్తున్నా… సర్పంచుల పెండింగ్ బిల్లులపై దృష్టి సారించలేదని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం శోచనీయం అని విమర్శించారు. గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులను కూడా ప్రభుత్వ అధికారులు రికార్డు చేయకుండా సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచు లు చేసిన పనులను వెంటనే రికార్డు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని బండి సంజయ్ కోరారు.
సీఎం రేవంత్రెడ్డికి బండి సంజయ్ లేఖ
0
564
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


