రంగంలోకి దిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలు

        వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలక ముందడుగు వేసింది. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి క్లస్టర్ల వారీగా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు హస్తం పార్టీ ప్రక టన చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్‌పీ నేతలు, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ఇన్‌చార్జ్‌లుగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు ఈ స్క్రీనింగ్‌ కమిటీల్లో ఎక్స్-అఫిషియల్ సభ్యులుగా ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

         క్లస్టర్ 1లో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరిలు ఉన్నాయి. ఈ క్లస్టర్ స్క్రీనింగ్ కమి టీకి తెలంగాణకు చెందిన హరీష్ చౌదరి ఛైర్మన్‌గా నియమించింది. విశ్వజీత్ కదమ్, జిగ్నేష్ మేవానీ సభ్యులుగా ఉన్నారు. చంఢీగడ్‌, పంజాబ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా ఉన్న హరీష్‌ చౌదరిని స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా నియ మించింది ఏఐసీసీ. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజక వర్గాలకు అభ్యర్ధుల ఎంపిక హరీష్‌ చౌదరీ ఆధ్వర్యంలో జరగనుంది.

      మరోవైపు క్లస్టర్ 2లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అండమాన్ – నికోబార్ దీవులు ఉన్నాయి. ఈ స్క్రీనింగ్ కమిటీకి మధుసూదన్ మిస్త్రీ చైర్మన్‌గా సూరజ్ హెగ్డే, షఫీ పరంబిల్ సభ్యులుగా ఉన్నారు. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, మూడవ క్లస్టర్‌లో ఉన్నాయి. రజనీ పాటిల్ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా కృష్ణ అల్ల వూరు, పర్గత్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. క్లస్టర్ 4లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఉన్నాయి. క్లస్టర్ 5లో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం ఉన్నాయి. మరోవైపు అఖిల భారత కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా సీనియర్ నాయకురాలు అల్కా లాంబాను ఆ పార్టీ నియమించింది.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్