వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు నుంచే పోటీచేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. విలువతోనే రాజకీయాలు చేస్తున్నా.. విలువల కోసమే మంత్రి పదవిని వదులకుని జగన్ వెంట నడిచానని..సామాజిక సమీకరణాల నేపధ్యంలోనే ఎమ్మెల్యే స్ధానాల మార్పు అన్నారు. గిద్దలూరు నుంచి పోటీ చేస్తున్నానన్న ప్రచారంలో నిజం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నానన్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు. టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నానన్నది అవాస్తవం అని బాలినేని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంత వరకూ సీఎం జగన్ తోనే ఉంటానని..ప్రతీ ఒక్కరూ పార్టీకి, సీఎం జగన్ కు అండగా ఉండాల్సిన సమయం అని స్పష్టం చేశారు. ఎంపీ మాగుంట విషయం సీఎం జగన్ తో మాట్లాడుతానని..సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యం అని స్పష్టం చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.
ఒంగోలు నుంచే పోటీచేస్తా.. బాలినేని
0
330
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


