తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఆటో డ్రైవర్ల ఉసురు తీస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఫ్రీ బస్ ప్రయాణ పథకం కారణంగా గిరాకీ లేక, కుటుంబాన్ని పోషించు కోలేక ఆటో డ్రైవర్ సతీష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సోమాజిగూడ బీఎస్ మక్తాలో సతీష్ తన ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యానుకు చీరతో ఉరేసుకుని సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. బీఎస్ మక్తాలోని కిరాయి ఇంట్లో నివాసం ఉండే 35 ఏళ్ల సతీష్‌గౌడ్ 15 ఏళ్లుగా ఆటో నడిపి జీవనం సాగిస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్ద దిక్కును కోల్పోయిన సతీష్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం – ఆటో డ్రైవర్ బలి
0
420
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


