మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి

   పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి అభ్యర్థిని ప్రకటించారు. మహ బూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు కాంగ్రెస్ తొలి అభ్యర్థి పేరును టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డిని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు.యాబై వేల ఓట్ల మెజార్టీతో వంశీ చంద్ రెడ్డిని గెలిపిం చాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

     ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొడంగల్ లో తొలిసారి రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించారు.ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు.అనంతరం నారాయణ పేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిం చారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఇప్పటికే వంశీ చంద్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేపట్టి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మహబూబ్ నగర్ ఎంపీ ఆయనకే ఫిక్స్ అని వార్తలు వినిపించగా.. సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే దేశ స్థాయిలో తెలంగాణ గొప్పతనం తెలుస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలతోనే కాంగ్రెస్ యుద్ధం అయిపోలేదని.. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ యుద్ధం గెలిచినట్లు అవుతుందని చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలన్నారు. వంశీ చంద్ రెడ్డి 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొంది తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్