ప్రపంచ వ్యాప్తంగా విండ్ పవర్ ఉత్పత్తికి పెరుగుతున్న ఆవశ్యకత

     ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్లో సోలార్ పవర్ తరువాత వినిపిస్తున్న పేరు పవన విద్యుత్‌. ప్రపంచమంతటా పవన విద్యుత్‌ చాలా పాపులర్. క్లీన్ ఎన‌ర్జీగా విండ్ ప‌వ‌ర్‌కు పేరుంది. విండ్ పవర్ అంటే పవన శక్తిని బ్లేడ్‌ల భ్రమణ శక్తిగా మార్చి విద్యుత్‌ను తయారుచేయడం.

          ప్రపంచవ్యాప్తంగా విండ్ పవర్ జనరేషన్ ఇటీవలికాలంలో పెరిగింది. విండ్ పవర్ ఉత్పత్తిపై ప్రపంచదేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. పవన విద్యుత్‌తో పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. విండ్ పవర్ నూటికి నూరుశాతం పర్యావరణహితమే. పవన విద్యుత్‌ తయారు చేయడానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. టర్బైన్‌ల వంటి సాధారణ పరికరాలతో విండ్ పవర్‌ను జనరేట్ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తం గా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో విండ్ పవర్ ఏడు శాతం కంటే ఎక్కువ అని లెక్కలు చెబుతున్నాయి. పవన విద్యుత్‌లో విండ్‌ఫామ్ అనేది కీలకం. విండ్‌ఫామ్ అంటే ఒకే ప్రదేశంలో ఉండే విండ్ టర్బైన్‌ల సమూహం. ఒకపెద్ద పవన క్షేత్రంలో అనేక వందల విండ్ టర్బైన్‌లు విస్తరించి ఉంటాయి. టర్బైన్‌ల మధ్య ఉన్న భూమిని వ్యవసాయం లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. దాదాపుగా అన్ని పెద్ద విండ్ టర్బైన్‌లు ఒకే విధమైన డిజైన్‌లు కలిగి ఉంటాయి.

      ఇటీవలికాలంలో విండ్ టర్బైన్ టెక్నాలజీ బాగా అభివృద్ది చెందింది. దీంతో విండ్ పవర్ జనరేషన్ ఖర్చు తగ్గింది. ప్రస్తుతం పొడవైన, తేలికైన విండ్ టర్బైన్‌ బ్లేడ్‌లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంమీద పవన విద్యుత్ ప్రాజెక్ట్ మూలధన వ్యయం అలాగే నిర్వహణా ఖర్చులు తగ్గాయి. ఈ నేపథ్యంలో విండ్ పవర్‌ జనరేషన్‌ పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. పవన విద్యుత్‌లో భారత్ సత్తా చాటింది. ఏడాదికి 39.2 గిగావాట్ల విండ్ పవర్‌ను ఉత్పత్తి చేసే సామ‌ర్థ్యం మ‌న‌దేశానికి ఉంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నిపుణులు ఈ విషయం వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో మ‌రో ఇర‌వై గిగావాట్ల విండ్ పవర్‌ను త‌యారు చేసే సామర్థ్యం భార‌త్‌కు వ‌స్తుంద‌ని గ్లోబ‌ల్ విండ్ ఎన‌ర్జీ కౌన్సిల్ జోస్యం చెప్పింది.అగ్రరాజ్యమైన అమెరికా అయితే విండ్ ప‌వ‌ర్ సెక్టార్‌కు టాప్ ప్రయారిటీ ఇస్తోంది. అమెరికాలో లక్షమందికి పైగా అమ్మాయిలు, అబ్బాయిలు ప్రస్తుతం విండ్ ప‌వ‌ర్ సెక్టార్‌లో ప‌నిచేస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే, విండ్ ప‌వ‌ర్ టెక్నీషియ‌న్ ఉద్యోగానికి అమెరికాలో ప్రస్తుతం బోలెడంత క్రేజ్ ఉంది. 2050 నాటికి మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో ఆరు లక్షల ఉద్యోగాలు క‌ల్పించ‌డానికి అమెరికా ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోందన్నది వాషింగ్టన్ డీసీ వర్గాల సమాచారం.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్