ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

      ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు కు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం నాడు రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక తీర్మానాన్ని చేసింది. దానికి హైదరాబాద్‌ మెట్రోపా లిటన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ ఆమోదించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అవసరమైన స్థలాన్ని కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వ స్థలం కేటాయించటం పట్ల గద్దర్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్