పదహారు మంది నిందితుల్లో 9 మంది పోలీసులే కీలక నేరస్తులు… !

       హైదరాబాద్ పంజాగుట్ట రోడ్డుప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రాహిల్‌తో కలిసి షకీల్‌ దుబాయ్ పారిపోయారని తెలిపారు. ఈ కేసులో పంజాగుట్ట, బోధన్‌ సీఐలను ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్లు ఆధారాలున్నాయని.. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం గాలిస్తు న్నామన్నారు.

         మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. యాక్సిడెంట్ కేసులో తన కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించా డని అభియోగాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. వీరుఇద్దరితో పాటు మరో నలుగురు విదేశాలకు పారిపోవటంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రజాభవన్ ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో A3 గా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నట్టు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. సాహిల్, షకీల్ ఇద్దరు దుబాయ్‌లో ఉన్నట్లు తెలిసిందన్నారు. ప్రధాన నిందితుడు సాహిల్ తో పాటు.. మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై కూడా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని క్లారిటీ ఇచ్చారు. పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు, బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ లను అరెస్ట్ చేసి జడ్జ్ ముందు ప్రవేశపెట్టామన్నారు. వారిద్దరికి పర్సనల్ బాండ్‌పై కోర్టు బెయిల్ ఇచ్చిందని తెలిపారు. ఈ కేసులో మొత్తం 16 మంది పై కేసు నమోదు చేశా మని… నిందితులకు పోలీసులు సహకరించినట్లు గుర్తించామని అన్నారు. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో మార్చ్ 2022 లో యాక్సిడెంట్ జరిగిందని, ఈ యాక్సిడెంట్ లో ఒక బాబు చనిపోయాడని అన్నారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌ని తప్పించారనే వార్తలు వచ్చాయని.. ఆ కేసును కూడా తిరిగి విచారణ చేస్తామని, ఆ కేసు కోర్టులో ట్రయల్ జరుగుతుందన్నారు.

        ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ను కేసు నుంచి తప్పించా రని ఆరోపణలు రావడంతో సిఐ దుర్గారావును అధికారులు సస్పెండ్‌ చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న దుర్గారావు ను ఫిబ్రవరి 5న ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంటలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి దుర్గారావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 16 మంది నిందితుల్లో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు పరారీలో ఉన్నా‌రు. ప్రధాన నిందితుడు సాహిల్, అతని తండ్రి షకీల్, మరో ఇద్దరు దుబాయ్‌లో ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు.ఒక్కరిని తప్పించే క్రమంలో 16మంది నిందితులుగా మారారు. తప్పు చేయడం ఒక ఎత్తెతే.. ఆ తప్పును కప్పిపుచ్చడం ఇంకా నేరం. తప్పు ఎవరుచేసినా.. శిక్ష తప్పదు అనటానికి ఈ కేసే నిదర్శనం.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్