జపాన్ భూ కంపం నన్ను కలచివేసింది – రాజమౌళి

నూతన సంవత్సరం వేళ ప్రపంచం అంతా సంబరాల్లో మునిగి పోయింది. అదే సమయంలో జపాన్ ను భారీ భూ కంపం కుదిపపేసింది. జాపాన్ పశ్చిమ తీర రాష్ట్రాలు వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో సంభవించింది. గడిచిన నలబై ఎనిమిది గంటల్లో 48 మంది మృతి చెందినట్టు పమాచారం.

ఈ భూకంపం పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. జపాన్ భూ కంపంపై దర్శకుడు రాజమౌళి స్సందించారు. భూ కంపం జపాన్‌ను తీవ్రంగా అతలాకుతలం చేసిందని, అది తనను కలిచి వేసిందని తెలిపారు. తన హృదయంలో జపాన్ దేశానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. భూ కంపం బారిన పడిన ప్రతి జపనీయుడికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారు సాధ్యమైనంత త్వరలో ఈ పరిస్థితి నుండి బయటపడాలని భావిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా రాజమౌళి ట్వీట్ చేశారు.

జక్కన్న దర్శకత్వంలో విడుదలై సత్తా చాటిన బాహుబలి-1, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు జపాన్ లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. జపాన్ లో ఈ చిత్రాలను వీక్షించడానికి థియేటర్లకు జనాలు పోటెత్తారు. ఆ సినిమాల ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన సందర్భంలో రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లపై జపాన్ ప్రజలు ప్రత్యేక అభిమానం చూపారు. జపాన్ లో రాజమౌళి, నటులను
విశేషంగా ఆదరించారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్