జపాన్ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం దెబ్బ

        జపాన్ ఆర్థికవ్యవస్థపై ఆర్థిక మాంద్యం దెబ్బపడింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానాని కి దిగజారింది. జర్మనీ అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని ఆక్రమించింది. జపాన్ ఆర్థిక  వ్యవస్థకు అనూ హ్యంగా 2023 చివరి నాటికి మాంద్యంలోకి జారుకుందని అక్కడి వార్తా సంస్థలు పేర్కొన్నాయి. జపాన్ జీడీపీ 4.2 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే. 0.4 శాతం నష్ట పోయింది. అదే సమయంలో జర్మనీ జీడీపీ 4.4 ట్రిలియన్ డాలర్లు ఉంది. జపాన్ కేంద్ర బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ జపాన్ తన దశాబ్దకాలంగా ఉన్న అల్ట్రా-లూజ్ మానిటరీ పాలసీ నుండి నిష్క్ర మించడంతో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. జపాన్ లో వృద్ధుల సంఖ్య పెరగడం, పిల్లల సంఖ్య తగ్గడం తో జపాన్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఉత్పాదకతను కోల్పోతోంది. 2010 వరకూ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానంలో ఉన్న జపాన్ను చైనా అధిగమించి నెంబర్ 2 స్థానాన్ని అందుకుంది. ఒకప్పుడు వాహనాల తయారీలో నెంబర్ 1 గా ఉన్న జపాన్ విద్యుత్ వాహనాల రాకతో క్రమంగా దెబ్బతింది. మున్ముందు భారతదేశం జపాన్ ను దాటేసినా ఆశ్చర్యం లేదని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్