ABVP రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్‌పై ఆయేషాపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఝాన్సీ జుట్టు లాగిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిష నర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీచేశారు. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 55 జారీచేసింది. జీవో రద్దు చేయాలంటూ ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఈ ప్రయత్నంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఝాన్సీ పట్ల దురుసుగా ప్రవర్తించింది కానిస్టేబుల్ ఆయోషా. స్కూటీ వెనకాల కూర్చొన్న ఆమె ఝాన్సీ జట్టు పట్టుకొని లాగడంతో ఝాన్సీకి తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ అయేషా దురుసుగా ప్రవర్తించిందని విచారణలో తేలడంతో సీపీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఏబీవీపీ కార్యకర్త జుట్టుపట్టిన కానిస్టేబుల్ సస్పెన్షన్
0
588
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


