ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన అరవింద్ కేజ్రీవాల్

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన కేసులో కేజ్రీవాల్‌ నేడు విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించినా ఏడుసారి కూడా ఆయన హాజరుకాలేదు. లిక్కర్‌ పాలసీ కేసులో ఈడీ ఏడోసారి జారీ చేసిన సమన్లను కూడా కేజ్రీవాల్‌ పట్టించుకోలేదు. నేడు విచారణకు కేజ్రీవాల్‌ హాజరు కాలేదు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని ఆమ్‌ ఆద్మీ పార్టీ గుర్తు చేసింది.

ఈడీ చట్టపరమైన ప్రక్రియను గౌరవించాలని సూచించింది. కేజ్రీవాల్‌కు పదేపదే సమన్లు జారీ చేసే బదులు కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని కోరింది. ముఖ్యమంత్రికి పలుమార్లు సమన్లు పంపడం సరికాదని ఆప్ పేర్కొంది. కోర్టులో తదుపరి విచారణ మార్చి 16న జరగనుంది. రోజువారీ సమన్లు పంపే బదులు ఈడీ ఓపిక పట్టాలని కోరింది. కోర్టు నిర్ణయం కోసం వేచి ఉండాలని తెలిపింది. మోదీ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిడి చేయకూడదని ఆప్ స్పష్టం చేసింది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్