27.2 C
Hyderabad
Sunday, February 15, 2026
spot_img

రష్యాలో కలకలం రేపుతున్న ప్రత్యర్థి నేత అలెక్సీ నావల్నీ మృతి

      రష్యాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నవేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు బద్ధశత్రువుగా పేరున్న విపక్ష అగ్రనేత అలెక్సీ నావల్నీ జైలులో శుక్రవారం మృతిచెందారు. ఆయన వయసు 47 ఏళ్లు. తీవ్రవాదం సంబంధిత అభియోగాలపై 19 ఏళ్ల కారాగార శిక్ష ఖరారవడంతో ఖార్ప్‌ పట్టణంలోని జైలులో ఉన్న నావల్నీ.. మార్కింగ్‌ వాకింగ్ అనంతరం అస్వస్థతకు గురయ్యారని ఫెడరల్‌ కారాగార సేవల విభాగం తెలిపింది. ఆ వెంటనే స్పృహ కోల్పోయారని తెలిపింది. అంబులెన్సులో వైద్య సిబ్బంది వచ్చి ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలి తం లేకపోయిందని వివరించింది. మరణానికి కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. నావల్నీ గురువారం వీడియో లింక్‌ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో జడ్జితో నవ్వుతూ మాట్లాడిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నావల్నీ మృతిపై పశ్చిమ దేశాల నేతలు, రష్యా విపక్ష నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను పుతినే చంపించారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. 2020లో విషప్రయోగానికి గురైన ఆయన.. జర్మనీలో దీర్ఘకాలం చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఆ విషప్రయోగం వెనుక పుతిన్‌ హస్తముందని అప్పట్లో ఆరోపణలు వెల్లు వెత్తాయి. వచ్చే నెలలో రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కిందటి ఎన్నికల్లో పుతిన్‌పై నావల్నీ పోటీ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్