23.2 C
Hyderabad
Tuesday, February 10, 2026
spot_img

మోదీపై నోరుపారేసుకున్న మాల్దీవుల ఎంపీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి లక్షద్వీప్‌ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై భారత్‌తోపాటు అంతర్జాతీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీ వుల ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులపై వేటు వేసింది. సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన వారిని పదవి నుంచి తప్పించినట్లు మాల్దీవుల విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఎవరిపై చర్యలు తీసుకున్నా రనేది మాత్రం చెప్పలేదు. మాల్దీవుల స్థానిక మీడియా ప్రకారం.. మరియం షియునా, మాల్షాతోపాటు మరో మంత్రి హసన్‌ జిహాన్‌లను మంత్రి పదవుల నుంచి తప్పించినట్లు సమాచారం.

      భారత్‌తోపాటు మోదీని ఉద్దేశిస్తూ మాల్దీవుల్లో అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై అక్కడి విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పింది. మంత్రులు అటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ముగ్గురు మంత్రులను తొలగించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించారు. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్‌ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీ వులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా చెబుతూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకంలో మాల్దీవులతో లక్షద్వీప్‌ ఏ మాత్రమూ సరితూగదంటూ ఎద్దేవా చేశారు. భారత్‌లో హోటల్‌ గదులు అసహ్యంగా ఉంటాయంటూ.. తమ దేశంతో లక్షద్వీప్‌కు పోలికేమిటి? అంటూ మాల్దీవుల ఎంపీ జహీద్‌ రమీజ్‌ కూడా నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్‌ కార్యాలయం అధికారులు నిరసన తెలిపారు. దుమారం నేపథ్యంలోవారి వ్యాఖ్యలను ‘ఎక్స్‌’నుంచి తొలగించారు.

      మంత్రుల వ్యాఖ్యలను మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ తీవ్రంగా ఖండించారు. భారత్‌ తమకు కీలక మిత్రదేశమని… మాల్దీవుల భద్రత, అభివృద్ధిలో చాలా కీలకమన్నారు. అలాంటి దేశాధినేతను ఉద్దేశించి నీచమైన భాష వాడటం తగదన్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కొత్త అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జుకు హితవు పలికారు. ఇంతగా నిరసనలు వ్యక్తమవుతున్నా మరియం మాత్రం ఆన్‌లైన్‌ వేదికలపై అక్కసు వెళ్లగక్కడం ఆపలేదు. దాతో పలువురు భారత నెటిజన్లు ‘బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌’అంటూ పిలుపునిస్తున్నారు!

        మాల్దీవుల మంత్రుల నోటి దురుసును క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్, బాలీవుడ్‌ నటులు అక్షయ్‌ కుమార్, సల్మాన్‌ ఖాన్, జాన్‌ అబ్రహం, శ్రద్ధా కపూర్‌ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. వారి విద్వేష వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని అక్షయ్‌ అన్నారు. ‘‘మాల్దీవులకు ఏటా భారీగా పర్యాటకులను పంపే భారత్‌పై అలా మాట్లాడటం దారుణమన్నారు సెలబ్రిటీలు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్