కరీంనగర్ జిల్లా మానుకొండూరులో ఆపరేషన్ ఎలుగుబంటి కొనసాగుతోంది. చెట్టు ఎక్కిన ఎలుగుబంటిని కిందికి దింపేందుకు అటవీ అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు ఎలుగుబంటి తనకు తానే చెట్టు దిగి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది. దీంతో ఎలుగుబంటికి మత్తు ఇచ్చి పట్టుకునేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయ త్నిస్తున్నారు. మానుకొండూరులో ఎలుగుబంటి సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈరోజు ఉదయం భల్లూకం గ్రామంలో ఓ భారీ చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. విషయం తెలుసుకున్న అధికారులు దాన్ని బంధించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. వరంగల్ నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు తీసుకుంది. చెట్టు చుట్టూ భారీ వలలు ఏర్పాటు చేశారు. కాసేపట్లో ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్ ఇస్తారనగా.. ఆలోపే అది చెట్టు దిగి పొదల్లోకి పారిపోయింది. వలలు సిద్ధం చేసిన తర్వాత భల్లూకం చెట్టు దిగి వెళ్లిపోవడంతో స్థానికులు తీవ్ర భయాం దోళనకు గురవుతున్నారు.
మానుకొండూరులో ఆపరేషన్ ఎలుగుబంటి
0
697
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


