పార్లమెంటు నియోజకవర్గ నేతలతో కేటీఆర్ భేటీ

          బీఆర్ఎస్‌ పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. రోజుకో పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావే శమవుతున్నారు. అక్కడి పరిస్థితులపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్‌, కరీంనగర్‌, చేవెళ్ల నియో జకవర్గాలపై సమీక్ష చేసిన కేటీఆర్‌.. ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంపై రివ్యూ చేశారు.

      పెద్దపల్లి లోక్‌సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీశ్‌రావు పాల్గొన్నారు. త్వరలోనే కేసీఆర్‌ పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకొస్తారని హరీశ్‌రావు అన్నారు. వచ్చే నెలలో కేసీఆర్‌ ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని చెప్పారు. త్వర లోనే కేసీఆర్‌ జిల్లాల పర్యటనలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు, వాయిదాలు అంటూ నడుస్తోందని తెలిపారు. ఏడాదిలోపు ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందన్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానంలో విజయం కోసం సమష్టిగా పనిచేయాలని సూచించారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా బీఆర్ఎస్‌ నడుస్తుందని చెప్పారు.

Latest Articles

టీడీపీలో దిద్దుబాటు చర్యలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్