పాకిస్తాన్ లో ఓ పోలీసు స్టేషన్ పై గుర్తు తెలియని దుండగులు జరిపిన దాడిలో పదిమంది పోలీసు సిబ్బంది చనిపోయారు. పాకిస్తాన్ లోని ద్రాబన్ ప్రాంతంలో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఉగ్రవా దులు మొదట స్నైపర్స్ ను ఉపయోగించి, కానిస్టేబుళ్లను లక్ష్యంగా చేసుకుని హ్యాండ్ గ్రనేడ్స్ ను విసిరారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ దాడికి సంబంధించి ఇంతవరకూ ఏ టెర్రరిస్ట్ గ్రూప్ ఈ దాడికి తామే బాధ్యుల మని ప్రకటించుకోలేదు. 2022 నుంచి , పాకిస్తాన్ తాలిబన్లు- ప్రభుత్వానికీ మధ్య కాల్పుల విరమణ రద్దయిన తర్వాత ఇస్లామిక్ మిలిటెంట్లు భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడులు ప్రారంభించాయి. ఈ దాడి పాక్ తాలిబన్ల పనేనని అనుమానిస్తున్నారు.
పాక్ లో పోలీసు స్టేషన్ పై దాడి … పదిమంది పోలీసుల మృతి
0
350
Previous article
Next article
Latest Articles
రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -
- Advertisement -


