28.2 C
Hyderabad
Wednesday, February 11, 2026
spot_img

నేడు ఇస్రో GSLV-ఎఫ్‌14 రాకెట్‌ ప్రయోగం

       భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 ప్రయోగించనుంది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిన్న మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగిన తర్వాత షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 దూసుకెళ్లనుంది. ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ అర్ధరాత్రి షార్‌కు చేరుకుని, కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తూ.. శాస్త్రవేత్తలకు, సూచన లు చేశారు. జీఎస్‌ఎల్‌వీ వాహకనౌక 2 వేల 275 కిలోల బరువు గల ఇన్సాట్‌-3డీఎస్‌ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవే క్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుప రుస్తుంది. ప్రస్తుతం కక్ష్యలోని ఇన్సాట్‌-3డీ, ఇన్సాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాలతో కలిసి పనిచేయ నుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్