చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. మూడు వారాల తర్వాత పిటిషన్‌పై తదుపరి విచారణ ఉంటుందని జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ తో కూడిన ధర్మాసనం తెలిపింది. చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు.

చంద్రబాబు కుటుంబం ఒక డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తోందని, వారు అధికారంలోకి వస్తే అందరిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో బెయిల్‌ మంజూరు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని, అధికారులను, దర్యాప్తు సంస్థను బెదిరిస్తున్నారని తెలిపారు. వెంటనే బెయిల్‌ రద్దు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ అన్నారు.

మరోవైపు.. ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశానికి తాము సమాధానం ఇస్తామని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్‌ సాల్వే అన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. మూడు వారాల తరువాత తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది.

Latest Articles

బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నారా?

రాజకీయాల్లో ఎంత కష్టపడి అధికారం సాధించామో, దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యంత్రాంగానికి గట్టి హెచ్చరికలే జారీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్