అవనిగడ్డ …ఈ సారి ఏ పార్టీకి అడ్డా

            కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతమైన అవనిగడ్డ కు కాబోయే ఎమ్మెల్యే ఎవరు అన్నది కోటి డాలర్ల ప్రశ్న. తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ పార్టీ టికెట్ ఆశిస్తుంటే.. జనసేన మరో పక్క ఆశలు పెంచుకుం టోంది. ప్రస్తుత ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ తనకే టికెట్ అనే ధీమాతో ఉన్నారు దీంతో అవనిగడ్డ నియోజకవర్గ రాజకీ యం ఆసక్తి కరంగా మారింది.

            కృష్ణాజిల్లా లోని అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. గడిచిన 50 ఏళ్లలో కేవలం ఒక పర్యాయం తప్ప అన్ని సందర్భాలలోనూ రెండు కుటుంబాల వారే ఎమ్మెల్యే గా గెలుస్తూ వస్తున్నారు. 1970 నుండి మండలి, సింహాద్రి కుటుంబీకులు వరుసగా గెలువగా 2009లో అంబటి బ్రాహ్మణయ్య గెలుపొందారు. ఆయన మర ణానంతరం ఉప ఎన్నికల్లో బ్రాహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరి ప్రసాద్ నెగ్గి, 6 నెలలు ప్రాతినిధ్యం వహించారు. ఆ ఎన్నికను మినహాయిస్తే 1972 నుండి 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, 6 సార్లు మండలి కుటుంబీకులు, 4 సార్లు సింహాద్రి కుటుంబీకులు గెలుపొందారు.

          అవనిగడ్డ నియోజకవర్గంలో 1955, 1962, 1967లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో చల్లపల్లి జమిందార్ వంశీ యులైన యార్లగడ్డ శివరామప్రసాద్ వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఆ తర్వాత 1972, 1978, 1983లలో జరిగిన ఎన్నికలలో మండలి వెంకట కృష్ణారావు కూడా వరుసగా 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1985, 1989, 1994ల లో సింహాద్రి సత్యన్నారాయణ టీడీపీ నుండి వరుసగా 3 సార్లు గెలిచి, హ్యాట్రిక్ సాధించారు. 1999, 2004లలో కాంగ్రెస్ పార్టీ తరపున మండలి బుద్ధప్రసాద్ గెలుపొందగా, 2009లో టీడీపీ అభ్యర్థి అంబటి బ్రాహ్మణయ్య అనూహ్యం గా గెలుపొందారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు అంబటి శ్రీహరి ప్రసాద్ ఎమ్మెల్యే గా గెలిచి 6 నెలలు ఎమ్మెల్యేగా పనిచేశారు.

         ప్రస్తుతానికి వస్తే… అవనిగడ్డ నియోజకవర్గంలో ఎవరికి వారు ఈసారి గెలిచేది మేమంటే మేము అంటూ తమ ప్రచారాలను కొనసాగిస్తున్నారు. రెండు సార్లు ఓడి, మూడోసారి నెగ్గిన సింహాద్రి రమేశ్ బాబుకు ఈసారి అవనిగడ్డ నియో జకవర్గంలో ఇబ్బందిగానే ఉంది. గతంలో అన్ని సర్వేలలో ఎమ్మెల్యేగా సింహాద్రి పనితీరు సరిగ్గా లేకపోవడంతో అధి ష్టానం హెచ్చరించిందనే వార్తలున్నాయి. ఆ తర్వాత సీఎం జగన్ ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్య క్రమం అవనిగడ్డ నియోజకవర్గంలో నిర్విఘ్నంగా జరిపించి, సింహాద్రి కాస్త గట్టెక్కారు.

          సింహాద్రి వ్యాపార భాగస్వామి డాక్టర్ శ్రీహరి హత్య కేసును పట్టించుకోకపోవడం, పోలీసులపై ఒత్తిడి తీసుకుని రాకపోవడంతో సింహాద్రి పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. దీనికితోడు నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకుడు కడవ కొల్లు నరసింహారావు కు ఎమ్మెల్యే కంటే కార్యకర్తలు ప్రాధాన్యత ఇవ్వడంతో సింహాద్రి గ్రాఫ్ పడిపోయింది. సీఎం జగన్ అవనిగడ్డ పర్యటనలో 100 కోట్ల రూపాయల హామీలను ఇచ్చి, ఏడాది గడిచినా నెరవేర్చలేకపోవడంతో ఎమ్మెల్యే కార్యా లయం ముందు ధర్నా సందర్భంగా జనసేన నేతలు, వీర మహిళలపై ఎమ్మెల్యే తన అనుచరులతో దాడి చేయించడ మే కాక, ఆ దాడిలో స్వయంగా పాల్గొనడం వివాదాస్పదమైంది. మచిలీపట్నం ఎంపి బాలశౌరి ప్రధాన అనుచరుడిని ఎమ్మెల్యే అనుచరులు కొట్టడంతో బాలశౌరి కూడా సింహాద్రికి వ్యతిరేకంగా ఉన్నారు.

              ఇక సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉపసభాపతిగా, అధికార భాషా సంఘం అధ్యక్షునిగా పనిచేసిన మం డలి బుద్దప్రసాద్ 2014లో తెలుగుదేశం పార్టీలో చేరారు. కోడూరు మండల రైతాంగ సమస్యలు, మట్టి అక్రమ రవాణా, ప్రజా సమస్యల పై ఉద్యమిస్తూ నియోజకవర్గ ప్రజలకు చేరువై, తన గ్రాఫ్ ని పెంచుకున్నారు. ఈసారి అవ నిగడ్డ నియో జకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయనే గెలుస్తారనే ప్రచారం ఉంది. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నందున అవనిగడ్డ నియోజకవర్గం సీట్ జనసేన పార్టీకి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. జనసేన పార్టీ తరుపున గుడివాక శేషుబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న బండ్రేడ్డి రామకృష్ణ అవనిగడ్డ సీట్ ఆశిస్తు న్నారు. రాబోయే ఎన్నికలలో వైఎస్సార్ సీపీ అభ్యర్ధిగా సింహాద్రి రమేశ్ బాబు ఉంటారా లేక అంబటి రాంబాబు వస్తారా అనేదిసస్పెన్స్. టీడీపీ – జనసేన పార్టీల పొత్తులో భాగంగా టిడిపి టికెట్ మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్ కి ఇస్తారా లేక జనసేన పార్టీ వారికీ ఇస్తారా అనేది కూడా ఇంకా సందిగ్డంలోనే ఉంది.

Latest Articles

తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యల దుమారం

తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీశ్‌ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపిస్తే... కాదు రేవంత్ రెడ్డే క్షుద్రపూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్‌ కౌంటరిచ్చారు. వర్షాలు పడకూడదని,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్