వైసీపీ పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్‌గా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులమయం చేసిందని మండిపడ్డారు. విశాఖ నగరంలోని తూర్పు నియోజ కవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. విశాఖను విషాదపట్నంగా మార్చేశారు. రెండు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే జోన్, విశాఖకు మెట్రో ప్రాజెక్టు హామీలను జగన్ నెర వేర్చలేదని విమర్శించారు. చంద్రబాబు సూపర్-6 పేరుతో హామీలను ప్రకటించారని చెప్పారు. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఏటా డీఎస్సీ ప్రకటిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో శంఖారావం సభ
0
650
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


