మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన ఆనంద్, సంజయ్ అనే ఇద్దరు యువకులు మేస్త్రీ పనుల నిమిత్తం గత వారమే చింతకుంట గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో రాత్రి సమయంలో శివారులోని బావి పక్కనే ఉన్న కల్వర్టుపై కూర్చుని ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఇద్దరూ పక్కనే ఉన్న బావిలో పడిపోయారు. చీకటిగా ఉండటంతో బయటకు రాలేక నీట మునిగి మృతి చెందారు.
——-
ఉదయం వరకు వారు గదికి రాకపోవడంతో, తోటి పనివారికీ అనుమానం వచ్చి వారి కోసం వెతకడం ప్రారంభించారు. చింతకుంట శివారులోని బావి వద్దకు వెళ్లి పరిశీలించగా, అక్కడ వారి చెప్పులు, ఇతర ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి బావిలో చూడగా ఇద్దరూ మృతి చెంది తేలియడం గమనించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధి కోసం వచ్చి విధి విచిత్రంగా ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

Latest Articles

ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌లో దారుణం

ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అక్రమ సంబంధాన్ని ప్రశ్నించాడనే కక్షతో భర్తనే అత్యంత కిరాతకంగా హతమార్చిన భార్యతో పాటు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్