మటన్ కోసం స్నేహితుడి మర్డర్

      మత్తులో గమ్మత్తుగ చిత్తైపోతావని ఓ కవి అన్నట్టు ఎంతో మంది జీవితాల మధ్యం మత్తులో పడి నాశనం చేసుకుం టున్నారు. అలాంటి సంఘటనే సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇద్దిరి స్నేహితుల మధ్య ఘర్షణ తలెత్తింది.వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్ తుకారం గేట్ పీఎస్ పరిధిలో దుర్ఘటన జరిగింది. గోల్ బాయ్ బస్తీకి చెందిన చారి, అజయ్ కిమధ్య మటన్ తినే విషయంలో చిన్నగొడవ ప్రారంభమైంది. అప్పటికే ఇద్దరు మద్యం పూటుగా తాగేసి ఉండడంతో గొడవ మరింత పెద్ద అయ్యింది. ఈ క్రమంలో అజయ్ కత్తితో చారిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృత్యు వాత పడ్డాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నింది తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest Articles

నర్సీపట్నం సబ్‌ జైలు నుంచి విడుదలైన పాస్టర్ అభినయ్‌

పాస్టర్‌ అభినయ్‌ దర్శన్‌కు బెయిల్‌ మంజూరయింది. నర్సీపట్నం సబ్‌ జైలు నుంచి అభినయ్‌ విడుదలయ్యారు. తనపై పెట్టింది దాడికి సంబంధించిన సెక్షన్లు కావని చెప్పారు. మతపరమైన సెక్షన్లు పెట్టారని.. పాదయాత్రలో మతపరమైన వ్యాఖ్యలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్