గుడివాడలో రా …కదిలిరా టీడీపీ సభకు ఏర్పాట్లు

   ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ప్రచార పర్వాలు ఊపందు కున్నాయి. ఈ క్రమంలో గుడివాడలో చంద్రబాబు రా… కదలిరా సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మల్లాయపాలెం లో జరిగే రా …కదిలిరా టీడీపీ సభా ఏర్పాట్లను మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ళ , రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, గుడివాడ టీడీపీ ఇంచార్జి వెనిగండ్ల రాముతోపాటు పలువురు టీడీపీ నేతలు పరిశీలించారు. సభా వేదిక నిర్వహణ పట్ల టీడీపీ నాయకత్వం సంతృప్తి వ్యక్తం చేసింది.

   ఇదిలా ఉండగా ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఘన నివాళులర్పించేలా గుడివాడ సభ జరుగుతుందని టీడీపీ నాయకత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గుడివాడలో జరిగే  కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతు న్నాయన్నారు. వైసీపీ అధినేత జగన్ అరాచక పాలనకు స్వస్తి పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో జరిగే 25 పార్లమెంట్ సభల కంటే, గుడివాడ సభను దీటుగా నిర్వహించాలని కృత నశ్చయంతో ఉన్నట్టు టీడీపీ నేతుల చెప్పారు. మరో నేత వెనిగండ్ల మాట్లాడుతూ.. 27 ఎకరాల్లో రా …కదిలా రా… సభ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈనెల 18న గుడివాడ నగరమంతా పసుపు మయం అవుతుందని తెలిపారు.  చంద్రబాబు సభలో గుడివాడ ప్రజల పౌరషాన్ని, టీడీపీ సత్తాను చాటి చెబుతామన్నారు. మరోనేత ఎమ్మెల్యే సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గుడివాడలోని రా …కదిలి రా సభను విజయవంతం చేయడానికి రాష్ట్ర టీడీపీ నాయకత్వం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోందన్నారు.

Latest Articles

రాష్ట్రంలో 74కు పైగా రైల్వేస్టేషన్‌లను ఆధునీకరిస్తున్నాం- ప్రధాని మోదీ

ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మోదీకి థింసా నృత్యంతో స్వాగతం పలికారు. స్వర్ణాంధ్రప్రదేశకు ఇదొక శుభదినమని మోదీ ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్