ఫైబర్‌నెట్ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఈ చార్జ్‌షీట్‌లో ఏ1గా చంద్రబాబు, ఏ2గా వేమూరి హరికృష్ణ, ఏ3గా కోగంటి సాంబ శివ రావును పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగినట్లు గుర్తించా మని సీఐడీ గతంలోనే తెలిపింది. మొత్తం 2వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో 333 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇందులో కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో భాగంగా టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు, లోకేష్‌కు సన్నిహితుడైన వేమూరి హరి కృష్ణకు చెందిన ‘టెరా సాఫ్ట్’ కంపెనీకి అక్రమంగా టెండర్లు కట్టబెట్టారనేది ప్రధాన అభియోగం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇప్పటికే పలు అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసి, రాజమండ్రి జైలులో 52 రోజుల పాటు ఉంచారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ అరెస్టు వ్యవహారం సంచలనంగా మారాగా.. తాజాగా మరో కేసులో చంద్రబాబు నాయుడిని ఏ1గా పేర్కొంటూ చార్జ్‌షీట్ దాఖ లు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుపై చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీఐడీ
0
541
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


