స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వైసీటీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనది ఆంధ్రా అని రేవంత్ అంటున్నారని.. నాది ఆంధ్ర అయితే.. మరి సోనియా గాంధీ ఎక్కడివారు.. ఆమెది ఇటలీ కదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అల్లుడు కూడా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి అని.. ముందు మీ ఇంట్లో సంగతి చూసుకోవాలని సూచించారు. తన వల్ల రేవంత్ ఉనికి ఎక్కడ పోతుందో అనే భయంలో ఉన్నారని.. అందుకే ఆయన ఇలా మాట్లాడుతున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న ఏకైక పార్టీ వైసీటీపీ మాత్రమే అని షర్మిల పేర్కొన్నారు. కేసీఅర్, రేవంత్, మోదీ, సోనియాలకు జై తెలంగాణ అనే హక్కు కూడా లేదని షర్మిల వెల్లడించారు.
నాది ఆంధ్ర అయితే.. నీ అల్లుడిది ఎక్కడ..?: షర్మిల
0
722
Previous article
Next article
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


