స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తులతో ప్రయాణిస్తున్న ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. తిరుపతి వెళ్తుండగా మొదటి ఘాట్‌రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే బస్సు డివైడర్ ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది. అటుగా వెళ్తున్న SPF సిబ్బంది అప్రమత్తమై బస్సు అద్దాలను ధ్వంసం చేసి భక్తులను కాపాడారు. ఈ ఘటనలో డ్రైవర్, పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది భక్తులు ఉన్నారు. అధికవేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కాగా కొద్దిరోజుల క్రితం కూడా మొదటి ఘాట్ రోడ్డులోనే భక్తులతో వెళ్తున్న ఓ జీపు అదుపుతప్పడంతో ఇద్దరు మహిళలు చనిపోయిన సంగతి తెలిసిందే.
తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా
0
504
Previous article
Next article
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


