నటుడు మహేష్ బాబు కూతురు సితారకు సైబర్ కష్టాలు

      సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల మోసాలతో అమాయకులను దోచుకుంటున్నారు. తాజాగా సైబర్ క్రిమి నల్స్ కన్ను టాలీవుడ్ ప్రముఖ హీరో మహేశ్ బాబు కూతురు సితారపై పడింది. సితార పేరుతో సైబర్ మోసాలకు తెరలేపారు.నటుడు మహేశ్ బాబు కూతురు సితార పేరుతో అభిమానులకు ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపి నగదు కాజేస్తున్నారు . ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఈ విషయం మహేశ్ బాబు టీం దృష్టికి వెళ్లింది. వెంటనే వారు అలర్ట్ అయ్యారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే సైబర్ నేరగాళ్ళను గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. అంతవరకు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.అభిమానులు అప్రమత్తంగా ఉండాలని మహేశ్ బాబు టీమ్ కోరింది. సితార పేరుతో వచ్చే అనుమానా స్పద నోటిఫికేషన్స్ కు, రిక్వెస్టులకు స్పందించవద్దని అభిమానులకు సూచించింది టీమ్ మహేశ్. సైబర్ నేరాల పట్ల అలర్ట్ గా ఉండాలని చెప్పింది.

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్