తెలిసీ తెలియని వైద్యంతో ప్రసవం …. గాల్లో కలిసిన పసికందు ప్రాణాలు

      నిరుపేదల బతుకులు బాగుపడని అతుకులు అంటూ సినీ కవి ఓ చిత్రంలో ఆవేదనాభరిత గేయ రచన చేశాడు. ప్రభుత్వ దవాఖానాల్లో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వాలు పలు పథకాలు ప్రకటించి పేదలకు వైద్య సేవలు అందించడానికి ప్రయత్నిస్తుంటే, దవాఖానాల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఈ లక్ష్యానికి గండి కొడుతోంది. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎందరో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతు న్నాయి.

       పాలకులు మారవచ్చు. పాత సర్కారు స్థానంలో కొత్త సర్కారు రావచ్చు. అయితే, ఏ ప్రభుత్వమైనా ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతాయి. సదుద్దేశంతో సర్కారు ప్రవేశపెట్టే మంచి పథకాలు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నీరుగారిపోతున్నా యి. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాలని ప్రతి ప్రభుత్వమూ భావిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎన్నో సౌకర్యాలు కల్పించి, పలు పథకాలకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టడం ఎప్పుడూ జరిగే విషయమే. అయితే, ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం వల్ల పేదలకు సరియైన వైద్యసాయం అందడం లేదు. కొన్ని సందర్భాల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యవైఖరి వల్ల కొందరు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

      ఆసుపత్రి అనగానే అత్యవసర సేవలు అనే మాట ఠక్కున స్ఫురిస్తుంది. ఎప్పుడు, ఎవరు ఏ అస్వస్థతకు గురవుతా రో ఎవరికి తెలియదు కదా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఆఘమేఘాల మీద ఆసుపత్రికి తీసుకెళతాం. అత్యవస ర సేవలందించే వైద్య సిబ్బంది… వెంటనే వైద్య సాయం అందించి రోగులు ప్రాణాలు నిలబెడతారు. అందుకే.. వైద్యో నారాయణో హరిః అని వైద్యులకు దైవస్థానం ఇస్తారు. అత్యవసర అందించాల్సిన వైద్యులు డ్యూటీలకు డుమ్మాకొట్టి, అక్కడున్న సిబ్బంది ఏదో వచ్చిరాని వైద్యం చేస్తే.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తుల ప్రాణాలు హరీ అనక ఏమవుతా యి. హైదరాబాద్ ఉప్పల్ ప్రభుత్వ దవాఖానాలో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. వైద్యులు అందుబాటులో లేకపో వడంతో వైద్య సహాయకులు, ఇతర వైద్య సిబ్బంది గర్భిణీ తెలిసీ తెలియని వైద్యం చేశారు. దీంతో, పసికందు ప్రాణా లు గాల్లో కలిసిపోయాయి. దీంతో, ఆ కుటుంబీకులు దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు.

     కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులను చేర్పించి, లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత పేదలకు ఉండదు. ఇందుకే ప్రభుత్వాలు పేద, మధ్య తరగతి వర్గాల కోసం కొన్ని ఉచిత పథకాలు ప్రవేశపెట్టి పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేలా చర్యలు తీసుకుంటోంది. అంతంత మాత్ర ఆర్థిక స్థోమత ఉన్న పేదలు సర్కా రు ఆసుపత్రుల్లో వైద్యం కోసం వస్తూంటే, వైద్యాధికారులు, వైద్యుల నిర్లక్ష్యవైఖరి వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతు న్నాయి. దీంతో, సర్కారు దవాఖానాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. మోయలేని ఆర్థిక భారాన్ని మోస్తూ…ప్రైవేటు ఆసుపత్రులకు సర్వం సమర్పించి… పేదరికంతో బాధపడుతున్నా అక్కడే వైద్యం చేయించుకుంటున్నారు. ఉచిత వైద్య పథకాలు, వైద్య కిట్లు, దవాఖానాల్లో మెరుగైన సౌకర్యాలు పేదలకు కల్పిస్తున్నా… వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యవైఖరిపై దృష్టి సారించకపోతే… ఇదంతా నిష్ప్రయోజనమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్