విద్యారoగానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలంటూ విద్యార్థినిలు పరీక్షలు , తరగతులను బహిష్కరించి పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా ముడుపు గల్లు గ్రామంలో చోటుచేసుకుంది.పాఠశాలలో మూత్ర శాలలు , మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టాలని విద్యార్థినిలు నినాదాలు చేశారు.ఈ సందర్బంగా విద్యార్థినిలు మాట్లా డుతూ….మా పాఠశాలలో మరుగుదొడ్లు లేఖ పోవడంతో విద్యార్థినిల మంతా ఒకటికి రెండు కు బయట కు సూదుర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ,ఉదయం పాఠశాల కు వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళే వరకు ఒకటికి రెండు కు బయటకు వెళ్లలేక అపుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విద్యాశాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ,సమస్య లను గుర్తించక పోవడంతో విద్యార్థినిలు ఇక్కట్లు పడుతున్నామని , ఇప్పటికైనా ఉన్నతాధికారులు పాఠశాలలో మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టాలని , లేకుంటే ప్రతి రోజు పాఠశాలకు హాజరై తరగతులను బహిష్కరించి ఆందోళన లు చేస్తామని తెలిపారు.
తెలంగాణలో సర్కార్ బడుల దుస్థితి..!
0
391
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


