తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎప్పుడంటే..

తెలంగాణ ఎన్నిక నగార మోగింది. ఎన్నికల తేదీలను ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. తెలంగాణలోని అన్ని స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబరు 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నవంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కీలక తేదీలు ఇవే..

నోటిఫికేషన్: నవంబర్ 3 2023.

నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 10 2023.

నామినేషన్ల ఉపసంహరణ: నవంబర్ 15 2023.

నామినేషన్ల పరిశీలన నవంబర్ 13 2023.

పోలింగ్ తేదీ: నవంబర్ 30 2023.

ఎన్నికల కౌంటింగ్: డిసెంబర్ 3 2023.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కీలక తేదీలు ఇవే..

5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం ప్రకటించారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించారు. ఈ ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

రాజస్థాన్‌లో 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. మిజోరంలో 8.25 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఈ రాష్ట్రాల్లో తొలిసారిగా ఓటు వేయనున్న 60.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

5 రాష్ట్రాల్లో 7.8 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 23.6 కొత్త మహిళా ఓటర్లు ఈసారి ఓటు వేయనున్నారు. ఎన్నికల సంఘం మొత్తం 5 రాష్ట్రాల్లో పర్యటించింది. పార్టీ ప్రతినిధులను కలిశాం. పోలింగ్ కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు.

సీనియర్ సిటిజన్లు ఇంటి నుండే ఓటు వేయగలరు. 80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 24.7 లక్షలు. ప్రతి పోలింగ్‌ బూత్‌ను కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షించనున్నారు. 1 లక్షా 77 వేల పోలింగ్ కేంద్రాలను నిర్మించనున్నారు. ఓటింగ్‌కు రెండు రోజుల ముందు ప్రచారం నిలిచిపోతుంది.

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్