తెలంగాణ ఎన్నిక నగార మోగింది. ఎన్నికల తేదీలను ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. తెలంగాణలోని అన్ని స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబరు 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నవంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కీలక తేదీలు ఇవే..
నోటిఫికేషన్: నవంబర్ 3 2023.
నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 10 2023.
నామినేషన్ల ఉపసంహరణ: నవంబర్ 15 2023.
నామినేషన్ల పరిశీలన నవంబర్ 13 2023.
పోలింగ్ తేదీ: నవంబర్ 30 2023.
ఎన్నికల కౌంటింగ్: డిసెంబర్ 3 2023.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కీలక తేదీలు ఇవే..
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం ప్రకటించారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించారు. ఈ ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
రాజస్థాన్‌లో 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. మిజోరంలో 8.25 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఈ రాష్ట్రాల్లో తొలిసారిగా ఓటు వేయనున్న 60.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
5 రాష్ట్రాల్లో 7.8 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 23.6 కొత్త మహిళా ఓటర్లు ఈసారి ఓటు వేయనున్నారు. ఎన్నికల సంఘం మొత్తం 5 రాష్ట్రాల్లో పర్యటించింది. పార్టీ ప్రతినిధులను కలిశాం. పోలింగ్ కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు.
సీనియర్ సిటిజన్లు ఇంటి నుండే ఓటు వేయగలరు. 80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 24.7 లక్షలు. ప్రతి పోలింగ్ బూత్‌ను కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించనున్నారు. 1 లక్షా 77 వేల పోలింగ్ కేంద్రాలను నిర్మించనున్నారు. ఓటింగ్‌కు రెండు రోజుల ముందు ప్రచారం నిలిచిపోతుంది.