37.2 C
Hyderabad
Saturday, May 2, 2026
spot_img

అబిడ్స్ ఫార్ట్యూన్ హూటల్ అడ్డాగా అఖిల్ పైల్వాన్ ఆగడాలు

        అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నవారిపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రాం నగర్ కు చెందిన నిందితుడు అఖిల్ పైల్వాన్ ని, మరో అయిదుగురు వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అబిడ్స్ ఫార్ట్యూన్ హొటల్ ను అడ్డాగా చేసుకుని అఖిల్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి మొబైల్ కాల్ డేటా, కాంటాక్ట్ నెంబర్లు, వాట్సప్ డేటాను పోలీసులు సేకరించి దర్యాప్తు సాగి స్తున్నారు.

     రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని హొటల్ యజమాని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. అబి డ్స్ లోని ఫార్ట్యూన్ హొటల్ ను అడ్డాగా చేసుకుని అఖిల్ పైల్వాన్ ఈ అవాంఛనీయ కార్యకలాపాలు చేపట్టాడు. సమా చా రం అందుకున్న పోలీసులు నిందితుడు అఖిల్ పైల్వాన్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని యువతులకు మాయమాటలు చెప్పి మురికి కూపంలోకి దించుతు న్నాడు. కొందరిని ఉద్యోగ అవకాశాల పేరిట మోసగిస్తున్నాడు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్, అబిడ్స్ పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నిందితుల ముఠాను పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా దళారులను ఏర్పాటు చేసుకుని అఖిల్ పైల్వాన్ ఈ నిర్వాకం సాగిస్తున్నాడు. పైల్వాన్ సెల్ ఫోన్లలో అత్యధిక శాతం పశ్చిమ బెంగాల్ దళారులు నెంబర్లు వున్నాయి. వాట్స్ ప్ గ్రూపులు, ఏజెంట్ల ద్వారా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ, హూటల్ కు కమిషన్ రూపంలో సగం మొత్తం చెల్లింపులు జరిగేవి. ఈ విషయం పోలీసు శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసు లు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు.

    అసాంఘిక కార్యకలాపాల వెనుక వున్న వ్యక్తులు ఎవరు…? గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ చీకటి వ్యవహా రంలో సినీ, రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖులు వున్నట్టు వచ్చిన వార్తల్లో నిజానిజాలు ఎంత..? ఈ కోణాల్లో పోలీసు లు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ హొటల్ లైసెన్స్ రద్దు చేయమని జీహెచ్‌ఎంసీకి పోలీసులు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా పైల్వాన్ ఏర్పాటు చేసుకున్న దళారీల గ్యాంగ్ లనను పట్టుకోవడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబం ధించి పకడ్బందీ దర్యాప్తు చేపట్టామని, ఎక్కడ ఏ క్లూ దొరికినా వదలకుండా వివరాలు రాబడ్తున్నామని తెలిపారు. 

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్