డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఆయనకు సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌పై బయట ఉన్న అనంతబాబు.. ఈ కేసులోని నలుగురు సాక్షులను ప్రలోభపెట్టడంతో పాటు, తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపుతానని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ఏప్రిల్ 24న అనంతబాబును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
హత్యకేసులో బెయిల్‌పైఉంటూ సాక్షులను బెదిరించడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. ఆధారాలతో నిరూపణ కావడంతో బెయిల్ రద్దు చేసింది
పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. బెయిల్ రద్దుతో హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు అనంతబాబు జైలులోనే ఉండనున్నారు. ఈ నెల20 నుంచి డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసు రెగ్యులర్ విచారణ ప్రారంభించనున్నట్లు న్యాయస్థానం తెలిపింది.


