స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బ తిన్న పంటలను వైసీటీపీ అధ్యక్షురాలు షర్మిల పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడిపోయారు. పక్కనే ఉన్న పార్టీ శ్రేణులు ఆమెకు సపర్యాయాలు చేయడంతో మళ్లీ తేరుకుని విలేకరులతో మాట్లాడారు. ఎండలో తిరగడంతో వేడిమికి ఆమె కళ్లు తిరిగి పడిపోయారని కార్యకర్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. కాగా ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆమె.. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. పదివేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని.. ఏప్రిల్ నెల పూర్తి అయినా ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అస్వస్థతతో సొమ్మసిల్లి కింద పడిపోయిన షర్మిల
0
337
Previous article
Next article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


