హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్రం Y+ సెక్యూరిటీని కల్పించింది. మాధవీలతకు ముప్పు ఉందని నిఘా వర్గాలకు కేంద్రానికి సమాచారం ఇవ్వ డంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా మాధవీలతకు 11 మంది పహారా కాస్తారు. ఆరుగురు CRPF పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా,.. మరో ఐదుగురు గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉంటారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం Y+ సెక్యూరిటీ కల్పిస్తోంది.
అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తున్న మాధవీలతకు Y+ భద్రత
0
293
Previous article
Next article
Latest Articles
తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 కొత్త క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -
- Advertisement -


