Telangana: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వచ్చే విద్యా సంవత్సరంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలలపై కూలంకషంగా చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్ధేశంలో గత సంవత్సరం ఎనిమిది వైద్య కళాశాలను ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని… ఇప్పుడు కూడా ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది తొమ్మిది కళాశాలల్లో ఎంబీబీఎస్ వచ్చే విద్యా సంవత్సరానికి మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల పనులు వేగవంతం చేయాలి: మంత్రి హరీష్ రావు
0
342
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


