Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

మహిళల సాధికారత… స్ఫూర్తి

   అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అన్నిరంగాల్లో స్త్రీలకు తగిన గౌరవం కల్పిస్తూ, మహిళా సాధికారత సాధించే లక్ష్యంతో.. ప్రపంచానికి స్త్రీ శక్తిని చాటి చెప్పేందుకు అంతర్జాతీయ మహిళా దినం ప్రారంభమైంది. యుగయుగాలుగా అణచివేతకు గురైన మహిళల హక్కుల కోసం పోరాడడం, సమానత్వాన్ని సాధించడం లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాగుతోంది. మహిళా దినోత్సవం ఎప్పుడూ ఊదారంగుతో ముడివడి ఉండడం విశేషం .

    మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తించడంపై దృష్టి సారించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ ఏడాది మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది థీమ్ ను ‘ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్: యాక్సిలరేటెడ్ ప్రోగ్రెస్’ అని నిర్ణయించింది. దేశ ఆర్థిక ప్రగతికి మహిళల ముందడుగే కీలకం అనే అర్థంలో ఈ థీమ్ ను ఎంచుకున్నారు. సృష్టికి మూలం మగువ. అకాశంలో సగం…అవనిలో సగం మహిళ ..తగిన ప్రోత్సాహం లభిస్తే.. అవకాశాలు లభిస్తే.. అంతకు మించి తమ సామర్థ్యం నిరూపించుకునే స్థితిలో నేటి మహిళ ఉంది. దేశ ప్రగతి, సమాజ ప్రగతి మహిళా సాధికారత పై ఆధారపడిఉంది. మహిళా సాధికారత లేని దేశాభివృద్ధి అసాధ్యం. మహిళా సాధికారత సాధించడానికి, ఆర్థికంగా మహిళలు బలోపేతం కావడానికి, దేశ ఆర్థిక రంగంలో మహిళలు కీలక పాత్ర పోషించాలి. అందుకు వ్యవస్థాపరమైన, విధాన పరమైన మార్పులు రావాలి. సామాజిక చైతన్యం, కుటుంబప రమైన ప్రోత్సాహం అవసరం.

        మహిళల హక్కులు, ఓటుహక్కు, మెరుగైన వేతనం, తక్కువ పనిగంటలు సాధించేందుకు సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా ప్రకటనతో 1909 ఫిబ్రవరి 28న తొలి జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఇదో విప్లవాత్మక ముందడుగు. 1910 లో కోపెన్ హాగన్ లో జరిగిన అంతర్జాతీయ వర్కింగ్ ఉమెన్ కాన్ఫరెన్స్ సందర్భంగా వార్షిక మహిళా దినోత్సవాన్ని స్థాపించాలని క్లారా జెట్కిన్ ప్రతిపాదించారు. ఇది ఏకగ్రీవ ఆమోదం పొందింది. దీంతో 1911 లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ లలో మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్, కంబోడియా, క్యూబా, మంగోలియా, రష్యా, ఉక్రేయిన్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాలు 110 ఏళ్లుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మహిళా దినోత్సవం కోసం మహిళలు సాగించిన పోరాటం ఓ చరిత్ర. 1975లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా సంవత్సరం గా ప్రకటించింది. అప్పటి నుంచి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

     ప్రపంచ జనాభాలో సగం మంది మహిళలే. 140 కోట్ల జనాభా గల భారతదేశంలో ప్రతి వెయ్యి మంది మహిళలకు 1020 మంది మహిళలు ఉన్నారని ఆర్థిక సర్వేలు వెల్లడించాయి. అయితే దేశ జీడీపీలో పురుషుల కంటే మహిళలు కచ్చితంగా వెనుకబడి ఉన్నారన్నది నిజం. మనదేశం లో జీడీపీలో మహిళల భాగస్వామ్యం పెంచాల్సిన అవసరం ఉంది. 1947లో భారత దేశం స్వాతంత్ర్యం సాధించేనాటికి దేశంలో మహిళా అక్షరాస్యత కేవలం 9 శాతం. ప్రస్తుతం మహిళా అక్షరాస్యత 77 శాతానికి చేరింది. దేశంలో 77 శాతం మహిళలు చదువుకుని పలు రంగాల్లో తమ ఉనికిని చాటు కుంటున్నారు. కానీ, అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఇప్పటికీ అవకాశాలు పొందలేక పోతున్నారు. ఇప్పటికీ సాంప్రదాయాలు, కట్టు బాట్ల కారణంగా.. ముందడుగు వేయని మహిళలు ఎందరో.

       మహిళలు అన్నిరంగాల్లో దూసుకు వెళ్తున్నారన్నది కేవలం రాజకీయనాయకుల ప్రసంగాలకు.. ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. పని ప్రదేశాల్లో ఇప్పటికీ మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా రంగాల్లో పురుషు లతో సమానంగా వేతనాలు లభించడం లేదు. మహిళల పట్ల వివక్ష, జీతాల్లో వ్యత్యాసాలు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో లైంగిక వేధింపులు, పని చేసే మహిళల పట్ల చిన్న చూపుకారణంగా.. ఉపాధి, ఆర్థిక సాధికారత పూర్తి స్థాయిలో సాధ్యం కావడం లేదు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. ఇటీవల భారత పార్లమెంటు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా అన్ని చట్టసభల్లో మహిళలకు మరింత ప్రాముఖ్యం లభించే వీలుఉంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతోనే ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ను ప్రత్యేకంగా నిర్ణయించింది. అన్నిరంగాల్లో మహిళల పురోగతి వేగవంతం కావాలని, ఇందుకు మహిళా సామర్థ్యాలను పెట్టుబడిగా వినియోగించాలని.. మహిళా ప్రగతికి మహిళలే స్పూర్తి నిస్తూ ముందుకు సాగాలని ప్రపంచం కోరుతోంది. మహిళలు అన్నిరంగాల్లో సాధికారత సాధిస్తారని ఆశిద్దాం.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్