Women’s Days |మనిషి పుట్టుకకు ఆమె కారణం. నిండు జీవితాన్ని ప్రసాదించే దైవం. ఒక మనిషి సమగ్ర భవిష్యత్తుకు ఆమె ఆధారం. అందరూ రెండు చేతులతో నమస్కరించదగిన గొప్ప దేవతా మూర్తి . నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం
ప్రతీ సంవత్సరం మార్చి 8న స్త్రీ గొప్పతనాన్ని గుర్తించేలా మహిళాదినోత్సవం నిర్వహిస్తున్నారు. మొదటగా ఈరోజుని అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. పలు దేశాల్లో మహిళలకు గౌరవం, గుర్తింపు దక్కడంతో క్రమేణా ఈ రోజుని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా చేయడం ఆనవాయితీగా మారింది. మొదటగా వివిధ దేశాలు వేర్వేరు రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసేవారు. ప్రస్తుతం అన్ని దేశాలు మార్చి 8న చేయడం విశేషం.
అయితే స్త్రీలు గొప్పవారా? లేక పురుషులు గొప్పవారా? అనే డిబేట్లు ఎన్నో జరిగాయి. అనేక సందర్భాల్లో మేం అంటే మేం అని పోటీ పడేవారు ఉన్నారు. కానీ నిజానికి పురుషుల కంటే స్త్రీలే గొప్పవారు. ఈ విషయాన్ని భారతదేశంలో ఎప్పటినుండో పాటిస్తున్న సనాతన ధర్మమే తేల్చి చెప్పింది. స్తీ గొప్పతనాన్ని అత్యద్భుతంగా వివరించింది. స్తీ వైశిష్ట్యం, ప్రాధాన్యత, భారత స్తీకి ఉండాల్సిన లక్షణాలు ఇలా అనేక విషయాల్ని వెల్లడించింది.
ప్రపంచ దేశాలకు సంప్రదాయాలను చాటి చెప్పింది భారతీయ మహిళే అని చెప్పాలి. భారతదేశం అందంగా ఉండటంలో, ఒదిగి ఉంటడంలో, కుటంబ బాధ్యతలను మోయడంలో ఇలా అనేక విషయాలను నేర్పించింది. అందుకే మన భారతీయ స్త్రీలను చూస్తే ప్రపంచదేశాలు రెండు చేతులెత్తి నమస్కరిస్తాయి.
‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ’ అనే శ్లోకంతో స్త్రీ ఎలా ఉండాలో మన సంప్రదాయం తెలిపింది. పనిలో దాసిగా, సలహా ఇవ్వడంలో మంత్రిగా, భోజనం పెట్టడంలో తల్లిగా అందంలో లక్ష్మిగా, పడక గదిలో రంభగా, క్షమించడంలో భూమాతగా మహిళ ఉండాలని చెప్పింది.
కుటుంబ బాధ్యతను పురుషుడే మోస్తాడు. కానీ స్తీ వెనకనుండి కుటుంబం మొత్తాన్ని నడిపిస్తుంది. అన్ని విషయాల్లో భర్తకు సహకరిస్తూ.. పెద్దవాళ్లకు సేవ చేస్తూ.. కుటుంబ అభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది.
‘పురుష జాతికోసం ఇన్నింటిని ఇచ్చే ఓ స్తీ.. నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం. రెండు చేతులెత్తి నమస్కరించడం తప్ప’
Read Also: జాతీయ స్థాయిలో డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు
Follow us on: Youtube Instagram