తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: కేటీఆర్‌, హరీష్ రావు

BRS Formation Day | తెలంగాణ ప్రజలందరికి బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్‌. ‘‘రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీకి పురుడు పోసి.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్ఠించి అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత మన కేసీఆర్. 22 ఏళ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత్‌ రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

అటు మంత్రి హరీష్ రావు కూడా తెలంగాణ ప్రజానీకానికి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్ .. ఉజ్వల భారత్‌ కోసం నేడు బీఆర్ఎస్.. అధినేత కేసీఆర్ సారథ్యంలో 22ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ఉద్యమ పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసింది. అనతి కాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలుస్తూ.. దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాంది పలికింది. 9 ఏళ్లలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్, తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను దేశవ్యాప్తం చేసేందుకు బయలుదేరారు’’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్