Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఢిల్లీ పీఠం మళ్ళీ మోదీకే దక్కేనా ?

    దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొంది. ముచ్చటగా మూడవసారి హ్యాట్రిక్‌ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో నిలిచారు. ఇందుకోసం వారణాసి నుంచి నామినేషన్‌ వేశారు. ఇక దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, వాజ్‌పేయి కనీసం మూడు సార్లు పీఎంగా ప్రమాణం చేశారు. అదే విధంగా ప్రస్తుతం ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచిన మోదీ వారి సరసన నిలుస్తారా.? హ్యాట్రిక్‌ కొట్టి వారిలాగే ప్రమాణస్వీకారం చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

  దేశంలో పార్లమెంట్ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. విపక్ష ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి మధ్య పోరు టగ్‌ ఆఫ్‌ వార్‌గా నడుస్తోంది. ఎలాగైనా ఈసారి అధికార పగ్గాలు చేపట్టాలని, దేశంలో పూర్వ వైభవం దిశగా హస్తం నేతలు ఆరాటపడుతుంటే, ప్రతిపక్షాల ఆటలు కట్టించి మూడవ సారి కూడా తామే నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలన్న తపనలో ఉన్నారు కమలనాథులు. ఇలా ఎవరికి వారు పావులు కదుపుతూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుండటంతో దేశ రాజకీయాల్లో ఎన్నికల వేడి అంతకు మించి అన్న రేంజ్‌లో కాకరేపుతోంది. ఇక ఎన్నికల బరిలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని మోదీ తన నామినేషన్‌ దాఖలు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల 45నిమిషాలకు నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు సీఎం యోగి ఆదిత్యనాథ్‌, పలువురు నేతలు పాల్గొన్నారు. అంతకుముందు నామినేషన్‌ ప్రోగ్రాం కోసం ఢిల్లీ నుంచి నేరుగా వారణాసి చేరుకున్న మోదీ. గంగానది అశ్వమేధ ఘాట్‌ వద్ద హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వారణాసిలోని రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమలనాథులు భారీగా ర్యాలీ నిర్వహించారు. దీనికి ఎన్డీయేకు చెందిన నేతలు హాజరయ్యారు. ఇక మోదీ నామినేషన్‌ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కూడా హాజరయ్యారు.

  యూపీలోని వారణాసి కమలనాథులకు కంచుకోట. 1991 నుంచి 2019వరకు కేవలం 2004లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు మోదీ. వారణాసి నుంచి తొలిసారి 2014లో మోదీ 3.70 లక్షల ఓట్ల మెజారిటీతో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో ఏకంగా 4.79 లక్షల ఆధిక్యంతో సమాజ్ వాదీ అభ్యర్థి మాలినీ యాదవ్ పై గెలుపొందారు. ఈసారి కూడా అంతకంటే భారీ మోజార్టీతో గెలిచి తన సత్తాను మరోసారి చాటాలన్న వ్యూహంలో ఉన్నారు. ఇందుకోసం కమలనాధులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే, ఇప్పటికే రెండుసార్లు గెలిచిన మోదీకి భారీ మెజార్టీతో గెలుపు అంత ఈజీ కాదని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. మరోవైపు నామినేషన్‌ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా ఓ భావోద్వేగపు వీడియోను షేర్‌ చేశారు ప్రధాని. కాశీ నగరంపై తనకున్న ప్రేమ, గంగానదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో దృఢమవుతూ వచ్చిందని, 2014లో కాశీకి వచ్చినప్పుడు గంగమ్మ తనను ఈ నగరానికి ఆహ్వానించినట్లు అనిపించిందని, ఈ పదేళ్ల కాలం తర్వాత ఆ గంగమ్మ తనను దత్తత తీసుకుందని చెప్పగలనంటూ గంగానదిని ఉద్దేశించి చెప్పుకొచ్చారు మోదీ. ఈ పదేళ్ల కాలంలో కాశీతో తన బంధం దృఢంగా మారిందని, ఇప్పుడు ఆ ప్రాంతం తనదని, ఒక తల్లి, కుమారుడికి ఉన్న సాన్నిహిత్యానికి ఫీల్ అవుతున్నానని ఉద్వేగంతో చెప్పిన మోదీ మాటలు నెట్టింట వైరల్‌గా మారింది. అయితే,.. మోదీ ప్రధాని అయ్యాక గంగానదిని శుద్ధి చేసే లక్ష్యంతో నమామి గంగ ప్రాజెక్టును చేపట్టారు. అది పదేళ్లుగా కొనసాగుతోంది.

   ఇక ఈసారి ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ నుంచి అజయ్‌రాయ్ బరిలోకి దిగారు. ఆయన యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. అజయ్‌రాయ్ సంఘ్, ఏబీవీపీ, బీజేపీ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఈసారి వారణాసిలో గట్టి పోటీ ఖాయమన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు వారణాసి నుంచి బరిలోకి దిగిన ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచేందుకు ఏడాది కిందట నుంచే ప్లాన్ చేసుకున్నారు. ఇండియా కూటమి పొత్తుల్లో భాగంగా ఈ సీటు కాంగ్రెస్‌కు వెళ్లింది. అయితే,1996లో అజయ్‌రాయ్ రాజకీయ జీవితం మొద లైంది. బీజేపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగన ఆయన. కమ్యూనిస్టులపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్లో అదొక సంచలనం. దీంతో ఆయన పాపులర్ అయ్యారు. అంతేకాదు బీజేపీ-బీఎస్పీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2007 తర్వాత ఢిల్లీ రాజకీయాలపై అజయ్ దృష్టి పెట్టారు. కానీ కమలనాథులు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో బీజేపీ నుంచి బయటకు వచ్చిన అజయ్‌రాయ్, సమాజ్‌వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. చివరకు మోదీపై అజయ్‌రాయ్ పోటీ దిగడం ఆసక్తికరంగా మారింది.

   దేశంలో హోరాహోరీగా ఇండియా కూటమి వర్సెస్‌ ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో బీజేపీ చెబుతున్నట్టు 400ల సీట్లు గెలిచి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందా.? లేదంటే పదేళ్లుగా కాచుకుని కూర్చుకున్న ఇండియా కూటమిని గెలుపు వరిస్తుందా అన్నది ఓవైపు ఉత్కంఠ రేపుతోంటే, మరోవైపు కమలనాథులు కలలు కన్నట్టు భారీ మెజార్టీతో మోదీ హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమే నా.? అన్న ఆసక్తి నెలకొంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్