35.2 C
Hyderabad
Sunday, May 26, 2024
spot_img

విడుదల కాని సినిమాలు ….మూతపడుతున్న థియేటర్లు

తెలంగాణలో సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి హైదరాబాద్ సిటీతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు యజమా నులు. సహజంగా  ఎండాకాలంలో బోలెడు సినిమాలు విడుదల అవుతుంటాయి. ఈసారి అందుకు భిన్నంగా ఈ సమ్మర్ హాలిడేస్ లో కొత్త సినిమాలు రిలీజ్ కాలేదు. దాంతో ప్రేక్షకులు లేక సినిమా థియేట ర్లు వెలవెలబోతున్నారు. ఈ క్రమంలో థియేటర్ యజమానులు మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా కొత్త సినిమాల విడుదలకు వాయిదా వేసుకున్నారు నిర్మాతలు. అంతేకాకుండా ఈ సారి సమ్మర్ టార్గెట్ గా చిన్నా చితక, పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాలేదు. దీంతో సింగిల్ ధియేటర్లలో సినిమాలు పడటం లేదు. కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటూ.. చిన్న సినిమాలను ఆడిస్తున్నారు ధియేటర్ల యజమానులు.మరోవైపు చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించటం లేదు. ఈ క్రమంలోనే థియేటర్ కరెంట్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు సైతం రాకపోవటం, నష్టాలు వస్తుండటం, మే నెలాఖరు వరకు కొత్త సినిమాలు విడుదల లేకపోవటంతో ధియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు యజమానులు.

సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేస్తున్నారు సరే.. మరి మల్టీఫ్లెక్స్ సంగతి ఏంటీ అంటారా.. ఆ ధియేటర్లలో తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లీష్, హాలీవుడ్, ఇతర భాషా చిత్రాలు వేస్తుంటారు. దీంతో వాళ్లకు గిట్టుబాటు అవుతుంది. దీనికితోడు మరీ నష్టాలు వస్తున్నాయి అనుకుంటే కొన్ని స్క్రీన్స్ క్లోజ్ చేస్తారు. దీంతో వాళ్లకు ఇబ్బంది ఉండదు. సింగిల్ స్క్రీన్ ధియేటర్లకు అలా కాదు కదా. అందుకే వాటిని మూసివేస్తున్నారు.

Latest Articles

ముంచుకొస్తున్న రెమాల్ తుఫాన్

రెమాల్ తుఫాను దూసుకొస్తోంది. బెంగాల్‌, అస్సోం, మేఘాలయలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. తుఫాను కారణంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేసి, విమాన రాకపోకలు నిలిపివేస్తు న్నారు. బంగాళాఖాతంలో రెమాల్‌ తుఫాన్‌ బలపడింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్