కచ్చితంగా సీఎం అవుతా.. తగ్గేదేలే: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

స్వతంత్ర వెబ్ డెస్క్:  దసరా ఉత్సవాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు సీఎం కావాలనే కోరిక ఉంది.. కచ్చితంగా అవుతానని.. వచ్చే పదేళ్లకు ముఖ్యమంత్రిని అవుతా అని.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. దసరా వేడుకల్లో భాగంగా సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇప్పటి వరకు తనను సంగారెడ్డి ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడున్నారని.. వారి దయతోనే తాను ఈ స్థాయికి వచ్చాను అని గుర్తు చేశారు. విజయదశమి రోజు తన మనస్సులో ఉన్న కోరికను ప్రజలందరి ముందు చెబుతున్నాను అంటూ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే.. మరో పదేళ్లకయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పారు. జగ్గారెడ్డి ఎవరికి ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండడని.. ఇటీవల అందరూ అంటున్న మాటలకు కూడా సమాధానం చెప్పారు. తాను ఫోన్‌లో అందుబాటులో లేకున్నా కూడా నా భార్య, అనుచరులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటారన్నారు. రామాయణంలో శ్రీరామచంద్రునికే నిందలు తప్పలేదు.. ఆప్ట్రాల్ నేనెంత అని అన్నారు జగ్గారెడ్డి. ఈ దసరా అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలన్నారు. వచ్చే దసరా పండుగను కూడా బ్రహ్మండంగా జరుపుకుందాం అన్నారు.

Latest Articles

మల్కాజిగిరిలో దారుణం.. భార్యను రివాల్వర్‌తో కాల్చి చంపిన భర్త

హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త రివాల్వర్‌తో కాల్చి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మృతురాలు నిషా రాణిగా గుర్తించారు. ఆరు నెలల కిందట నిందితుడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్