జ్ఞానవాపీ మసీదు అసలు వివాదం ఏమిటి ?

       తోడర్‌మల్లు 16వ శతాబ్దంలో నిర్మించిన జ్ఞానవాపి ఆలయం ఆ తరువాతి కాలంలో కూల్చివేతకు గురైంది. ఔరంగజేబు హయాంలో ఆలయం కూల్చివేత జరిగిందన్నది చరిత్రకారుల అభిప్రాయం. అయితే మతపరమైన విద్వేషంతో జ్ఞానవాపి ఆలయం కూల్చివేత జరగలేదంటున్నారు చరిత్రకారులు. కేవలం రాజ్య విస్తరణ అనే ఏకైక కాంక్షతోనే ఆలయాన్ని కూల్చివేశారన్నది చరిత్రకారుల అభిప్రాయం. అయితేకూల్చివేత తరువాత గుజరాత్‌లోని జాన్‌పురికి చెందిన వ్యాపారి ఇక్కడ జ్ఞానవాపి ఆలయాన్ని మళ్లీ నిర్మించారన్నది ఒక అభిప్రాయం. స్థానిక హిందూ వర్గాలు కూడా ఇదే విషయం వెల్లడిస్తున్నాయి.

      ఇదిలా ఉంటే ఎడ్విన్ గ్రీవ్స్ అనే బ్రిటిష్ పరిశోధకుడు ఒక సంచలన విషయం చెప్పాడు. బ్రిటిష్ హయాంలో జ్ఞానవాపి ప్రాంతంలో ఉన్న కట్టడాన్ని ఎవరూ ఒక మసీదుగా పరిగణించలేదన్నది ఎడ్విన్ గ్రీవ్స్ అభిప్రాయం. అయితే ఎడ్విన్ గ్రీవ్స్ అభిప్రాయాన్ని కాశీలోని ముస్లిం వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. జ్ఞానవాపి మసీదును కైవసం చేసుకునే కుట్రలో భాగంగానే ఎడ్విన్ గ్రీవ్స్‌ను ఉదహరిస్తూ సమాజంలో ఆలయానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాయి ముస్లిం వర్గాలు. జ్ఞానవాపి మసీదుకు సంబంధించి హిందూ మహాసభ కూడా ఒక సంచలన విషయం వెల్లడించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇక్కడి పావెలిన్ వద్ద రుద్రాభిషేకం నిర్వహించినట్లు హిందూ మహాసభ పేర్కొంది. రుద్రాభిషేకం జరిగినట్లు తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని హిందూ మహాసభ వాదిస్తోంది. ఇదిలా ఉంటే 1984లో జ్ఞానవాపి వివాదం తెరమీదకు వచ్చింది. దీంతో జ్ఞానవాపి హిందువులదేనంటూ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. మసీదు గోడలపై శివుడు, గౌరి, గణేశ్ ఆకృతులు ఉన్నాయనిఆరెస్సెస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో జ్ఞానవాపి తమదేనంటూ ఆరెస్సెస్ న్యాయస్థానం మెట్లెక్కింది. కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

    కాగా ఆరెస్సెస్ పిటీషన్‌ను కోర్టులో ముస్లిం సంఘాలు సవాల్ చేశాయి. ఈ వివాదంపై 1997లో స్థానిక సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. విచారణ నేపథ్యంలో 2021లో జ్ఞానవాపి మసీదులో తిరిగి సర్వేకు కోర్టు అనుమతి ఇచ్చింది. తాజాగా జ్ఞానవాపి మసీదులోని భూగృహంలో పూజలకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. వారణాసి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసి డెంట్ అలోక్ కుమార్ స్పందించారు. జ్ఞానవాపి మసీదును ఆలయంగా ప్రకటించాలని అలోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో ఆలయ నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఇదిలా ఉంటే వారణాసి కోర్టు తీర్పు పట్ల ముస్లిం సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వారణాసి కోర్టు తీర్పును పై కోర్టులో తాము సవాల్ చేస్తామంటున్నారు ముస్లిం సంఘాల నాయకులు. జ్ఞానవాపి మసీదు అంశం చివరకు మరెన్ని మలుపుతు తిరుగుతుందో చూడా ల్సిందే.

Latest Articles

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్