యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని మార్చి నెల ఆదాయం ఎంతంటే?

Yadadri| తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో రూపుదిద్దుకున్న ఆలయం యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం. తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రాల ప్రశస్తాన్ని చాటి చెప్పేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్దితో శరవేగంగా ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం రాష్ట్రానికి మణిమాణిక్యంగా, రాష్ట్రంలో ప్రసిద్ధ దేవాలయంగా విరాజిల్లుతోంది. ఇప్పుడిప్పుడే యాదగిరీశుషుని దర్శనానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. శిల్పకళతో దేదీప్యమానంగా వెలుగుతున్న ఈ ఆలయాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. వచ్చే వత్సరాలలో ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు దీటుగా రూపుదిద్దుకోనుంది. తిరుమలకు సమానంగా ఆదాయాన్ని గడిస్తుందని పలువురు విశ్లేషకులు చెపుతున్నారు.

ఇదిలా ఉంటే.. మార్చి నెలలో స్వామివారి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆలయ అధికారులు వివరాలు తెలుపుతూ…మార్చి నెల ఆదాయం రూ. 48,81,789 వచ్చినట్లు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 3,05,100, కైంకర్యముల ద్వారా రూ. 5,101,సుప్రభాతం ద్వారా రూ. 4,600,పుష్కరిణీ ద్వారా రూ. 1,250,వ్రతాలు ద్వారా రూ. 2,06,400 ఆదాయం సమకూరిందని తెలిపారు.ప్రచార శాఖ ద్వారా రూ. 7,000, వీఐపీల దర్శనం ద్వారా రూ. 1,12,500,యాదరుషి నిలయము ద్వారా రూ.61,260, ప్రసాదవిక్రయం ద్వారా రూ. 10,59,900,పాతగుట్ట ద్వారా రూ. 36,660,కళ్యాణ కట్ట ద్వారా రూ. 80,000 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అలాగే శాశ్వత పూజలు ద్వారా 5,000, వాహన పూజల ద్వారా రూ. 23,700, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ. 3,50,000, సువర్ణ పుష్పార్చన ద్వారా 79,716, శివాలయం ద్వారా రూ. 8,600, అన్నదానం ద్వారా రూ. 12,402, బ్రేక్ దర్శనం ద్వారా రూ. 2,37,600, ఇతరముల ద్వారా రూ. 22,85,000 ఆదాయం ఆలయానికి వచ్చినట్లు తెలిపారు.

 

 

 

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్