నేనేం తప్పు చేశా.. నన్నేందుకు బలి చేశారు- ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్: ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హబ్సిగూడలో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2001 బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి తాను పార్టీలోనే ఉన్నానని.. ఎన్నో ఇబ్బందులు, తిప్పలు పడి ఉప్పల్‌లో పార్టీని కాపాడానని అన్నారు. తనను కాదని ఉప్పల్ టికెట్ ప్రకటించిన బండారు లక్ష్మారెడ్డి పార్టీ కోసం ఏం చేశాడని.. ఏనాడైనా జెండా మోసిండా అని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి టికెట్ ఎలా కేటాయిస్తారని అధిష్టానాన్ని నిలదీశారు.

ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నేతల ఫొటోలు పెట్టుకుని తిరుగుతున్నాడని అన్నారు. గ్రేటర్‌లో నేను ఒక్కడిని ఉద్యమకారుడినని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప్పల్ టికెట్ వేరే వ్యక్తికి ఇచ్చే ముందు కనీసం తనతో చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఏం తప్పు చేశానని.. తనను ఎందుకు బలి చేశారని ఎమోషనల్ అయ్యారు. తనకు టికెట్ కేటాయించపోవడంతో తన కేడర్ ఆందోళన చేస్తామంటే తానే వద్దన్నానని చెప్పారు.

10 రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని భేతి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ ఇటీవల 115 మందితో కూడిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ జాబితాలో ఉప్పల్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన భేతి దక్కలేదు. ఉప్పల్ టికెట్‌ను సీఎం కేసీఆర్ బండారు లక్ష్మారెడ్డికి కేటాయించారు. దీంతో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Latest Articles

జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌ తగిలింది. సీఐడీ స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిల‌ర్ అని సీఐడీ తేల్చింది. విజయ‌వాడ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్