Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

తెలంగాణ ఎన్నికలపై వైసీపీ నేతల అంచనాలేంటి?

తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రచారం హోరెత్తుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ గెలవబోతోంది అన్నది ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆసక్తి ఎక్కువగా ఉంది. మరి.. ఇక్కడి ఫలితాలపై అక్కడి అధికార పార్టీ నాయకుల ఆలోచన ఏంటి ? అసలు ఏ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే బాగుంటుంది అని అక్కడి వైసీపీ నాయకులు భావిస్తున్నారు ?

పోరాటాల గడ్డ తెలంగాణపై ఎవరి జెండా ఎగరబోతోంది ? ఇదే ప్రశ్న..అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ దీనిపై ఉత్కంఠ పెరుగుతోంది. కేవలం ఇక్కడే కాదు..పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణలో అధికారంలోకి రాబోయేది ఎవరన్న దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.

సామాన్య ప్రజానీకంలోనే కాదు రాజకీయ పార్టీల్లోనూ ఈ చర్చ ప్రముఖంగా జరుగుతోంది. అయితే..ముఖ్య నేతలు, పెద్ద నేతలూ దీనిపై పెద్దగా దృష్టి సారించక పోయినా.. ఆయా పార్టీల కేడర్ మాత్రం జోరుగానే చర్చలు జరుపుతోంది. ప్రధానంగా అధికార వైసీపీ ఈ విషయంలో కొంచెం ఎక్కువగా దృష్టి సారించినట్లు కన్పిస్తోంది. ప్రత్యేకించి కింది స్థాయి నేతలు రానున్న తెలంగాణ ఎన్నికల్లో మరోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు సమాచారం.

అయితే.. వైసీపీ నాయకులు ఇలా కోరుకోవడంలో పెద్ద కొత్తేమీ లేదన్న వాదన రాజకీయ వర్గాల్లో విన్పిస్తోంది. రాజకీయాల్లో తమకు ఎదురైన పరిస్థితుల ఆధారంగా చంద్రబాబును ఉమ్మడి శతృవుగా చూస్తూ వచ్చారు కేసీఆర్, జగన్. అందుకు తగ్గట్లుగానే 2018 తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేసింది టీడీపీ. స్వయంగా చంద్రబాబు నాయుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. అయితే..నాటి ఎన్నికల్లో గులాబీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. అనంతర పరిణామాల్లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసింది కారు పార్టీ. అంతే తిరుగులేని విజయం సాధించారు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్.

వైసీపీ నాయకులు బీఆర్‌ఎస్ గెలుపు కోరుకోవడం వెనుక ఇక్కడే మరో కారణంగా కూడా ఉంది. ఇప్పటికే ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు పోరాడుతున్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయంగా ఇక్కడ మారే పరిస్థితులు ఏపీపైనా ప్రబావం చూపుతాయని భావిస్తున్నారు. ఎందుకంటే ఏపీలో జగన్‌ ఓటు బ్యాంకులో ఎక్కువ భాగం కాంగ్రెస్‌ పార్టీ నుంచి మళ్లిందే. పైగా కాంగ్రెస్‌, టీడీపీ మధ్య గతంతో పోలిస్తే.. ప్రస్తుతం మరింత సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. దీంతో.. రానున్న ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు పైకి కన్పించకపోయినా జగన్‌ను దెబ్బకొట్టేందుకు కచ్చితంగా కలిసే పనిచేస్తాయన్న అభిప్రాయం మెజార్టీ వైసీపీ వర్గాల్లో విన్పిస్తోంది.

మరి..ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ నాయకులు కోరుకున్నట్లు బీఆర్ఎస్ గెలుస్తుందా ? లేక డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లు ఫలితం వస్తుందా ? అన్నది డిసెంబర్ 3న తేలిపోనుంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్