స్వతంత్ర వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా సహకరిస్తోందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయినందుకు బీఆర్ఎస్ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై కూడా ఆయన స్పందించారు. బీఆర్ఎస్‌పై గట్టిగా పోరాటం చేసిన సంజయ్‌ని బీజేపీ ఆ పదవి నుంచి అన్యాయంగా తొలగించిందని విమర్శించారు. రాష్ట్రంలోనూ బీజేపీని ఓడించేందుకు పని చేస్తామని స్పష్టం చేశారు.