తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంచు విష్ణు

మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రాన్ని ఈ రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు, ఈరోజు ‘కన్నప్ప’ చిత్రాన్ని శ్రీ కాళహస్తిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభిస్తారు.

భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మోహన్ బాబు ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్టార్ ప్లస్‌లో మహాభారత సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు.
విష్ణు మంచు సరసన హీరోయిన్‌గా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ నటిస్తారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్ర కథకి కీలక మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తారు.

త్వరలో షూటింగ్ మొదలుపెట్టి సింగల్ షెడ్యూల్‌లో ఈ సినిమా మొత్తం కంప్లీట్ చేస్తామని మంచు విష్ణు చెప్పారు. అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుండి టాప్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో ప్రకటిస్తామన్నారు.

Latest Articles

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్